మిరా మిరా మీసం తిప్పిన 'కాటమరాయుడు'
ఒకరోజు ముందుగానే అనౌన్స్ చేసినట్టుగా 'కాటమరాయుడు' మూవీకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ ను యూట్యూబ్ ద్వారా విడుదల చేశారు. "మిరా మిరా మీసం మెలి తిప్పుతాడు జనం కోసం .. కరా కరా కండల రోషం పోటెత్తుతాది జనం కోసం" అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్ కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం సమకూర్చారు.
‘కాటమరాయుడు‘ గుణగణాలను కీర్తిస్తూ సాగే ఈ పాట పవన్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతంలో అనురాగ్ కులకర్ణి ఈ పాట పాడాడు. మెగాఫ్యామిలీ హీరోలంతా ఈ మధ్య ఫాలో అవుతున్న కొత్త ట్రెండ్ తరహాలో ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ ఏవీ లేకుండా.. ఒక్కో పాట ఇలా నెట్ లోనే డైరెక్ట్ గా విడుదల చేయబోతున్నారు. ఇక ఈ నెల 18న ఫ్రీ-రిలీజ్ ఫంక్షన్ నిర్వహించి.. 24న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.