సమంత ఇంటికి చేరిన 'అఖిల్' హీరోయిన్
ఇటీవల హీరోయిన్స్ లో చాలామంది హోటల్స్ కంటే సొంత ఇంటినే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నా వంటి భామలు హైదరాబాద్ లోనే సొంతిల్లు ఏర్పాటు చేసుకోగా.. ఇప్పుడు ఈ వరుసలో 'అఖిల్' ఫేం సాయేషా సైగల్ కూడా చేరింది. తాజాగా ఈ బ్యూటి హైదరాబాద్ లో ఓ ఇల్లు కొనుగోలు చేసిందని సమాచారం.
'అఖిల్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయేషా సైగల్... ఫస్ట్ మూవీతోనే భారీ పరాజయాన్ని చవిచూసింది. దీంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో హిందీలో 'శివాయ్', తమిళంలో 'వనమగన్' చిత్రాల్లో నటించింది. అవేవి కూడా సాయేషాకు సరైన లిఫ్ట్ ఇవ్వలేదు. దీంతో తిరిగి టాలీవుడ్ వైపు చూస్తోందట. ఇందుకోసమే హైదరాబాద్ కు మకాం మార్చుతోందట.
ఇక సాయేషా కొన్న ఇల్లు మరెవరిదో కాదు. సమంతదే. ఒకప్పుడు సమంత నివాసమున్న ఇంటినే ఇప్పుడు సాయేషా కొనుగోలు చేసిందట. లోకల్ గా ఉండటం వల్ల తెలుగులో అవకాశాలు కోసం ప్రయత్నించడం ఈజీ అవుతుందని భావించిందట సాయేషా. మరి.. గోల్డెన్ లెగ్ అనిపించుకున్న సమంత నివాసమున్న ఇల్లు.. ఐరన్ లెగ్ అనిపించుకున్న సాయేషాకు అదృష్టం తెచ్చిపెడుతుందేమో చూద్దాం..!