గాయపడ్డ కంగన.. ముఖంపై కత్తి గాటు
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.. ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న 'మణికర్ణిక'లో నటిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం హైదారాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన స్పెషల్ సెట్ లో షూటింగ్ జరుపుకుంటోంది. షూటింగ్‌లోని ఓ ఫైట్ సీన్ లో మరొకరి కత్తి కంగనకు తగటడంతో ముఖంపై కత్తి గాయమైంది.
వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స చేసిన వైద్యులు కొద్దిరోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచమని సూచించారట. పది కుట్లకు పైగానే పడ్డాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలుస్తోంది. మైనర్ ఇంజూరీనే అయినప్పటికీ రెండు కనుబొమ్మల మధ్యలో గాయం అవడంతో.. షూటింగ్‌కు కొన్నిరోజుల పాటు అంతరాయం కలగొచ్చు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ ను మీరు పైన చూడొచ్చు.