HeadLines

రాజమౌళి సినిమాలకు కీరవాణి మ్యూజికే ఎందుకు..?



రాజమౌళి సినిమా అంటే కీరవాణి మ్యూజిక్ కంపల్సరీ. తాను దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ’స్టూడెంట్ నం.1’ నుండి ఇటీవల విడుదలైన ’బాహుబలి 2’ వరకూ అన్ని చిత్రాలకూ కీరవాణే సంగీతం సమకూర్చాడు. ఇందుకు వీరిద్దరిదీ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కావడం కారణమైతే.. జక్కన్నకు కీరవాణి స్వయానా సోదరుడు కావడం మరో కారణం. అయితే.. ఇవే కాకుండా ఇంకో బలమైన కారణం కూడా ఉందట.

రాజమౌళి సినిమాలన్నీ మ్యూజికల్ గానూ సూపర్ హిట్స్. అయితే.. రాజమౌళి భార్య రమాకు మాత్రం మ్యూజిక్ అంటే అస్సలు పడదట. ఫోన్ లోనో, మ్యూజిక్ సిస్టమ్ లోనో ఏదైనా పాట ప్లే చేస్తే.. వెంటనే ఆపేయమంటూ పోరు పెడుతుందట. అయితే.. ఈ విషయంలో కీరవాణి పాటలకు మాత్రం మినహాయింపు ఉందట. సో.. అందుకే తన సినిమాలకు కీరవాణిని తప్ప మరొకరిని సంగీత దర్శకుడిగా తీసుకోలేనని.. ఇటీవల ఓ టీవీ షోలో సరదాగా చెప్పుకొచ్చాడు రాజమౌళి.