HeadLines

సైలెంట్ గా ప్రారంభమైన చిరంజీవి 151వ సినిమా

'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' జీవితం ఆధారంగా.. చిరంజీవి 151వ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. పంద్రాగస్టుకు ఈ సినిమా టైటిల్ లోగోను ఆవిష్కరిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ.. అలాంటిదేం జరగలేదు. దీంతో.. చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు-22న ఈ సినిమాను లాంచ్ చేస్తారనుకున్నారు. అయితే.. అందరికీ షాక్ ఇస్తూ చడీచప్పుడు లేకుండా ఈ సినిమా ప్రారంభమైంది.

హైదరాబాద్ లోని కొణిదెల ప్రొడక్షన్స్ ఆఫీసులో ఈ రోజు ఉదయం ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. చిరంజీవి కుటుంబ సభ్యులతో పాటు పరుచూరి బ్రదర్స్, దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరంతా కలసి దర్శకుడు సురేందర్ రెడ్డికి స్క్రిప్ట్ ను అందజేశారు.


చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని ఈ సినిమా టైటిల్ తో పాటు, మోష‌న్ పోస్ట‌ర్ విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను కూడా విడుదల చేశారు. ఆగష్టు 22 ఉదయం 11 గంటల 30 నిముషాలకు ఈ మోషన్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు. కేవలం టైటిల్ తోనే సరిపెడతారో లేక ఉయ్యాలవాడ గెటప్ లో మెగాస్టార్ ను కూడా చూపిస్తారో తెలియాల్సి ఉంది.