HeadLines

'డౌన్ టు ఎర్త్' అంటే ఇదేనా అంటోన్న వెన్నెల కిశోర్

 
వెండితెరపై తనదైన కామెడీ టైమింగ్ తో మెప్పించే వెన్నెల కిశోర్.. స్టార్ కమెడెయన్స్ లో ఒకరుగా దూసూకెళ్తున్నాడు. తాను స్క్రీన్ పై మాత్రమే కామెడీ చేస్తానని రియల్ లైఫ్ లో చాలా బోరింగ్ పర్సన్ ను అని చెప్పుకునే కిశోర్.. ఇంటర్వ్యూలతో పాటు ట్విట్టర్ లోనూ భలేగా వ్యంగాస్త్రాలు ఎక్కుపెడుతుంటాడు. తాజాగా ఓ ఫొటో ట్వీట్ తో సెటైర్ వేశాడు కిశోర్.

టాలీవుడ్ మోస్ట్ బిజీయస్ట్ కమెడియన్ అయిన కిశోర్.. తాను నటిస్తోన్న ఓ సినిమాకు సంబంధించిన స్టిల్ ను ట్వీట్ చేశాడు. ఆ ఫొటోలో కుండలు చేయడానికి వాడే మట్టి దిబ్బ మధ్యలో..  నిలబడి ఉన్నాడు కిషోర్. ఈ సినిమాలో తన క్యారెక్టర్ 'డౌన్ టు ఎర్త్' అని చెప్పిన దర్శకుడు తనతో ఇలా మట్టి తొక్కించాడంటూ ట్వీట్టర్ లో సెటైర్ వేశాడు. ఈ ఫొటోకు నెటిజన్స్ నుంచి భలే రెస్పాన్స్ లభిస్తోంది. ఆ ఫొటోను మీరు ఇక్కడ చూడొచ్చు..