మరో మలయాళ రీమేక్.. ఐదుగురు భామలతో
తమిళ చిత్రాల్లో ఎక్కువభాగం తెలుగులోనూ అనువాద రూపంలో విడుదలవుతున్న దృష్ట్యా.. టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఈమధ్య మలయళ సినిమాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో మరో మలయాళ చిత్రం తెలుగులోకి రాబోతోంది. పైగా ఇందులో ఐదుగురు హీరోయిన్స్ నటించబోతుండటం విశేషం.
మూడేళ్ల క్రితం మలయాళంలో వచ్చిన థ్రిల్లర్ మూవీ '100 డిగ్రీస్ సెల్సియస్'. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయబోతున్నారు. 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' చిత్రాన్ని తమిళంలో తెరకెక్కించిన మిత్రన్ జవహర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.
ఐదుగురు అమ్మాయిల జీవితంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆ ఐదుగురు అమ్మాయిలుగా.. హెబ్బాపటేల్, నందితా శ్వేత, లక్ష్మీరాయ్ , రాగిణి ద్వివేది, నికిషా పటేల్ హీరోయిన్స్ గా ఎంపికయ్యారు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'లో నటించిన హెబ్బాపటేల్, నందిత శ్వేత ఈ సినిమా కోసం మరోసారి కలసి నటించనుండటం విశేషం.