మరో బయోపిక్.. అభినవ్ బింద్రాగా అనిల్ కపూర్ కొడుకు
కొత్తగా కథలు వెతుక్కోవడం కంటే.. ఆల్రెడీ జరిగిన కథనే సినిమాగా తెరకెక్కించడం సులువుగా భావిస్తున్నారు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్. మరీముఖ్యంగా ఇందులో క్రీడాకారుల జీవితాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో 'మేరికోమ్', అజహార్, ఎంఎస్.ధోని అంటూ ఇప్పటికే పలువురు క్రీడాకారుల జీవితాలు వెండితెరకెక్కగా.. ఇప్పుడు అభినవ్ బింద్రా బయోపిక్ రూపొందబోతోంది.
భారత్ నుంచి ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన షూటర్ అభినవ్ బింద్రా. ఈ పాత్రను అనిల్ కపూర్ కొడుకు హర్షవర్ధన్ కపూర్ పోషించబోతున్నాడు. గతేడాది రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వంలో వచ్చిన `మీర్జాయా` సినిమాతో హర్షవర్ధన్ కపూర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక అభినవ్ బింద్రా బయోపిక్ విషయాన్ని హర్షవర్ధనే స్వయంగా తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్ ద్వారా వెల్లడించాడు. కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి దేశం గర్వించదగ్గ క్రీడాకారుడి పాత్రను పోషించే అవకాశం లభించడా.. తన అదృష్టంగా భావిస్తున్నాన్నాడు. ఈ సందర్భంగా.. తాను అభినవ్‌తో దిగిన ఫొటోను షేర్ చేశాడు హర్షవర్థన్ కపూర్.