రవితేజ కొడుకు కనిపించబోయేది ఈ క్యారెక్టర్ లోనే..?
రవితేజ తాజా చిత్రం 'రాజా ది గ్రేట్' శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాతోనే రవితేజ కొడుకు మహాధన్ వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ ను కూడా రివీల్ చేశారు. చిత్రయూనిట్ తో కలసి దిగిన ఫొటోలో చేతిలో స్టిక్ తో కనిపిస్తున్నాడు మహాధన్. దీంతో.. ఈ చిత్రంలో చిన్నప్పటి రవితేజ క్యారెక్టర్ లో అంధుడి పాత్రను మహాధన్ పోషిస్తున్నట్టు అర్థమవుతోంది.
ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ తో ఈ సినిమా టాకీపార్ట్ కంప్లీట్ అవనుందని తెలుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నాడు.