HeadLines

ముఖ్యమంత్రిగా మహేశ్ ఫస్ట్ లుక్ ఇదే


మహేశ్ తాజా చిత్రం 'స్పైడర్' ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోకపోవడంతో రాబోయే 'భరత్ అనే నేను'పైనే ఆశలు పెంచుకుంటున్నారు అభిమానులు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలసి ఇటలీ ట్రిప్ లో ఉన్న మహేశ్.. స్వదేశానికి రాగానే ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అవనున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ సర్ప్రైజింగ్ ఫస్ట్ లుక్ ఒకటి ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది.

గతంలోనూ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆన్ లొకేషన్ స్టిల్స్ లీక్ అయినప్పటికీ.. తాజాగా లీకైన కొత్త ఫొటోలో మహేశ్ గెటప్ రివీల్ అవడంతో అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. మహేశ్ ఈ సినిమాలో సీఎం పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ ఫొటోలో ఫార్మల్ కాస్టూమ్స్ తో మహేశ్ రొటీన్ గానే కనిపిస్తున్నప్పటికీ.. చుట్టూ గన్ మెన్స్ హడావుడి చూస్తుంటే ఇదే సీఎం గెటప్ అని తెలుస్తోంది. ఇలా లీక్ అయిన ఫొటోస్ ను ఎక్కువగా ప్రోత్సహించవద్దంటూ దర్శకుడు కొరటాల శివ ట్వీట్ చేయడం విశేషం. మహేశ్‌కి జంటగా బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వాణి నటిస్తోన్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.