'సింహాద్రి' బ్యూటీకి బాబు పుట్టాడు
'లాహిరి లాహిరి లాహిరి' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత 'సింహాద్రి' వంటి విజయాలు అందుకున్న అంకిత గుర్తుందా. తెలుగునాట తక్కువ సినిమాల్లోనే నటించినా మంచి గుర్తింపును అందుకున్న అంకిత.. గత ఏడాది విశాల్ జగపత్ అనే పారిశ్రామిక వేత్తను పెళ్లాడి ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయింది. అమెరికాలో ఉంటోన్న ఈ జంటకు.. ఇటీవల ఓ పండండి బాబు పుట్టాడు. ఈ చిన్నారికి నీల్ అని పేరు పెట్టిన అంకిత.. భర్తతో కలసి కొడుకును చూపిస్తూ చిన్నారి ఫొటోతో పాటు వీడియోను తన అభిమానుల కోసం షేర్ చేసింది.