నితిన్ హీరోగా 'శ్రీనివాస కల్యాణం' ఫిక్స్
'శతమానం భవతి' తర్వాత ఈ సినిమా దర్శకుడు సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీనివాస కళ్యాణం' అనే సినిమాకు ప్లాన్ చేశాడు నిర్మాత దిల్ రాజు. అయితే.. ఈ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతా సహా పలువురి పేర్లు వినిపించాయి. ఇప్పుడీ ప్రాజెక్ట్ నితిన్ హీరోగా సెట్స్ పైకి వెళ్లబోతోందట. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా నితినే స్వయంగా అనౌన్స్ చేశాడు.
వచ్చే ఏడాది మార్చిలో షూటింగ్ ప్రారంభించుకోబోతున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి శ్రావణ మాసంలో విడుదల చేస్తామని చిత్రయూనిట్ తెలయజేశారు. 'అ..ఆ..' తర్వాత ఈ సినిమాతో మరోసారి మిక్కీ జే మేయర్... నితిన్ కు సంగీతం అందిస్తున్నాడు. దిల్ సినిమా వచ్చిన 14 ఏళ్ల విరామం తర్వాత నితిన్-దిల్ రాజు కాంబినేషన్ లో ఈ సినిమా రూపొందనుండటం విశేషం. దర్శకుడు సతీశ్ వేగేశ్న గత చిత్రం తరహాలోనే ఇది కూడా ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.