HeadLines

ఫిదా చేస్తోన్న పవన్ మూవీ ఫస్ట్ సాంగ్




పవన్ కళ్యాణ్‌ సినిమాకు సంబంధించిన టైటిల్ ను త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా ప్రకటిస్తారని ఎంతో ఆశగా ఎదురుచూశారు అభిమానులు. అయితే.. టైటిల్ అనౌన్స్ మెంట్ జరగలేదు కానీ.. పవన్ ఫ్యాన్స్ ను ఏమాత్రం నిరాశపరచకుండా.. ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ను విడుదల చేశారు. బయటకి వచ్చి చూస్తే అనే పల్లవితో సాగే ఈ పాటను త్రివిక్రమ్ బర్త్ డే కానుకగా ఈరోజు విడుదల చేశారు.

అనిరుధ్ సంగీతం అందించడంతో పాటు తానే స్వయంగా ఈ పాటను పాడగా.. శ్రీమణి సాహిత్యం సమకూర్చాడు. అభిమానుల నుంచే కాక సంగీత ప్రియుల నుంచి కూడా ఈ సాంగ్ కు సూపర్బ్ ఫీడ్ బ్యాక్ లభిస్తోంది. స్టైలిష్ గా ఉంటూనే సరళమైన సంగీతం, సాహిత్యంతో కూడిన ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటోంది. అనిరుధ్ కు తెలుగులో ఇదే తొలి పాట కావడం విశేషం. డిసెంబర్ లో ఈ సినిమా ఆడియో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.