HeadLines

తన పెళ్లి కథనాలపై శ్రుతిహాసన్‌ సెటైర్స్

గత కొన్నాళ్లుగా యూరప్‌కు చెందిన మైఖేల్ కోర్సెలేతో శ్రుతిహాసన్‌ ప్రేమలో ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆమధ్య మైఖేల్‌ కూడా చెన్నై వచ్చి శ్రుతిహాసన్‌ బంధువుల వివాహానికి హాజరయ్యాడు. దీంతో వీరి ప్రేమకు కమల్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేసిందనే వార్తలొచ్చాయి. అప్పట్లో శ్రుతి ఆ వార్తలను ఖండించడంతో ప్రచారం కొంత తగ్గింది.

ఇటీవల తిరిగి అతనితోనే లండన్‌లో క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ను సెలబ్రేట్‌ చేసుకుంది శ్రుతి. అందుకు సంబంధించిన ఫొటోస్‌ను కూడా శ్రుతి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో మళ్లీ వీరి పెళ్లి విషయంపై మళ్లీ ప్రచారం జోరందుకుంది. ఈ ఏడాదే శ్రుతి పెళ్లి అంటూ ఓ వార్తపత్రికలో వచ్చిన కథనాన్ని రీట్వీట్‌ చేసిన శ్రుతి.. ‘నిజమా..? నాకు కూడా ఇది వార్తే’ అంటూ సెటైరికల్‌గా స్పందించింది.