HeadLines

రెచ్చిపోయిన ‘లోఫర్‘ బ్యూటి


వరుణ్ తేజ్ సరసన ‘లోఫర్‘ సినిమాతో పూరి జగన్నాథ్ పరిచయం చేసిన దిశా పటానీ అందరికీ గుర్తుండే ఉంటుంది. బాలీవుడ్ లో 'ధోనీ ద అన్ టోల్డ్ స్టోరీ'తో పాటు ఇంటర్నేషనల్ యాక్షన్ స్టార్ జాకీ ఛాన్ సరసన ‘కుంగ్ ఫూ యోగా‘లోనూ మెరసింది దిశా. ఇక తాజాగా ఈ యూపీ చిన్నది డాన్సులతో దుమ్మురేపుతోంది. 

‘లోఫర్‘ సినిమాలోనే డాన్సులు ఇరగదీసిన దిశా.. ఇటీవల 'షేప్ ఆఫ్ యూ' అనే పాటకు కొరియోగ్రాఫర్ హర్షవర్థన్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులేసింది. దిశా ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసిన ఈ వీడియో యూట్యూబ్ తో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజానికి ఇప్పటి వరకు ఈ పాటకు ఎంతో మంది డాన్సులు చేసిన వీడియోలు నెట్ లో ఉన్నాయి. కానీ.. వీటన్నింటిలో దిశా పటానీ వేసిన స్టెప్పులు మాత్రమే సూపర్ అనే టాక్ వచ్చింది. ఆ సాంగ్ చూసి.. మీరూ ఎంజాయ్ చేయండి..