HeadLines

సంక్రాంతి బరిలో శింబు 'ఈశ్వరుడు'


శింబు హీరోగా నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్రామీణ నేపథ్య చిత్రం "ఈశ్వరన్". తెలుగులో ఈ చిత్రం "ఈశ్వరుడు"గా విడుదల కానుంది. దసరా సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ లో శింబు తనదైన స్టైల్ లో లుంగీ కట్టుకొని పడగవిప్పిన పాముని మెడలో వేసుకొని కనిపిస్తున్నాడు. 

ఇక ఈ చిత్రంలో శింబు సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీతం సమకూర్చనున్నాడు. ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

మాధవ్ మీడియా బాలాజీ సమర్పణలో డీ కంపెనీ - కేవీ దురై బ్యానర్ పై బాలాజీ కపా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.