HeadLines

'రోషగాడు'గా విజయ్ ఆంథోని

వైవిధ్యమైన కధా చిత్రాలకు, రియలస్టిక్ క్యారక్టరైజేషన్స్ కు కేరాఫ్ అడ్రస్ విజయ్ ఆంథోని. ప్యామిలీ ఓరియెంటెడ్ కంటెంట్ బేస్ట్ సినిమాలు చెస్తూ వస్తొన్న ఈ హీరో ఇప్పుడు రోషగాడు గా ఊర మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తమిళ్ లో తిమిరపుడిచవాబ్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తెలుగులో రోషగాడు అన్న టైటిల్ ను ఎనౌన్స్ చేశారు. ఆగస్ట్ 1 సాయంత్రం 5గం.లకు
ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చెయనున్నారు.కేరీర్ ప్రారంభం నుంచి విజయ్ ఆంథోని చేసిన సినిమాలు కథా బలమున్న చిత్రాలుగా ప్రశంసలను పొందాయి. అలాంటిది  తొలిసారి పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా , అంతే కమర్షియల్ టైటిల్ తో వస్తొన్న రోషగాడు తో  విజయ్ ఆంథోని ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి
నివేథా పేతురాజ్ (మెంటల్ మదిలో ఫేం) హీరోయిన్ గా , డేనియల్ బాలాజీ ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంథోని
నిర్మాణం:విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ , నిర్మాత :ఫాతిమా విజయ్ ఆంటోని.    రచన-దర్శకత్వం గణేష్, పిఆర్ఓ: సాయి సతీష్.