HeadLines

శర్వానంద్‌తో గొడవపై సాయిపల్లవి స్పందన

'ఫిదా', 'ఎంసీఏ' సినిమాలతో బడా హిట్స్ అందుకున్న సాయిపల్లవికి తెలుగునాట యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ స్పెషల్ క్రేజ్ ఉందనే విషయం తెలిసిందే. ఇండస్ట్రీలోనూ సాయిపల్లవికి ఎంత క్రేజ్ ఉందో.. అంత విమర్శలు కూడా ఉన్నాయి. షూటింగ్స్ కు ఆలస్యంగా వస్తుందని ఆ మధ్య వార్తలు వినిపించాయి. అంతేకాదు.. ఏ సినిమాలో నటిస్తే ఆ హీరోతో గొడవపడుతూ ఉంటుందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. 

'కణం' సినిమా టైమ్ లో నాగశౌర్యతో.. 'ఎంసీఏ' సమయంలో నానితో గొడవ పడిందనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం శర్వానంద్ సరసన 'పడిపడి లేచే మనసు'లో నటిస్తోంది సాయిపల్లవి. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం.. ఇటీవల షూటింగ్ కు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సాయిపల్లవి శర్వానంద్ తో గొడవ పడిందని.. అందుకే శర్వా షూటింగ్ కు వెళ్లడం లేదనే టాక్ వినిపిస్తోంది. 

ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి సాయిపల్లవి వరకూ చేరడంతో.. తాజాగా ఈ మేటర్ పై స్పందించింది. ఇందులో ఏమాత్రం నిజం లేదు. మా నడుమ అలాంటి గొడవలేం జరగలేదు. శర్వానంద్ ఈ సినిమాతో పాటు మరో చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఆ మూవీ షూటింగ్ లోనూ పాల్గొనడం వల్లే.. ఈ సినిమాకు బ్రేక్ ఇచ్చాడు తప్ప గొడవలేం లేవంటూ క్లారిటీ ఇచ్చింది. మరి.. సాయిపల్లవి మాటలు నమ్మేద్దామా..!