HeadLines

మరో భారీ ప్రాజెక్టులో శ్రుతిహాసన్

తమిళంలో ఒక భారీ బడ్జెట్ సినిమా చేయడానికి దర్శకుడు సి. సుందర్ సన్నాహాలు చేస్తున్నాడనే వార్త కొంతకాలంగా వినిపిస్తోంది. 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మితం కానున్న ఈ సినిమాను, తెలుగులో మహేశ్ తోను .. తమిళంలో విజయ్ తోను చేయడానికి ఆయన సన్నాహాలు చేసినా ప్రయోజనం లేకపోయింది.

దాంతో జయం రవి .. ఆర్య లతో ఈ సినిమా చేయడానికి ఆయన రెడీ అయ్యాడు. ఈ సినిమా కోసం కొంతమంది హీరోయిన్ల పేర్లను పరిశీలించిన ఆయన, చివరికి శ్రుతిహాసన్ ను ఎంపిక చేశాడనేది తాజా సమాచారం. కథ విన్న వెంటనే శ్రుతి హాసన్ ఓకే చెప్పేసిందని అంటున్నారు. తమిళంతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.