'ఆర్ఎక్స్-100' హాట్ సాంగ్ రిలీజైంది..!
'ఆర్ఎక్స్100' సినిమా ఘనవిజయాన్ని అందుకోవడంలో హీరో కార్తికేయ యాక్టింగ్, దర్శకుడు అజయ్ భూపతి టాలెంట్ తో పాటు... హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ అందాల ఆరబోతకు మేజర్ క్రెడిట్ దక్కుతుంది. ముఖ్యంగా 'అదిరే హృదయం' అనే పాటలో పాయల్ ఇంటిమేట్ సీన్స్ యూత్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఇతర పాటలను విడుదల చేసిన టీమ్.. ఈ పాటను మాత్రం రిలీజ్ చేయకుండా ఊరించారు. ఎట్టకేలకు ఇప్పుడీ పాటను విడుదల చేశారు.
సినిమాలో చూపించిన మోస్ట్ రొమాంటిక్ కంటెంట్ లో ఎక్కువభాగం ఈ పాటలోనే ఉండడతో ఈ వీడియో సాంగ్ చూసేందుకు యూత్ తెగ ఆసక్తి చూపిస్తోంది. దీంతో విడుదలైన కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్ తో వేల లైక్స్ తో ఈ పాట యూట్యూబ్ లో దూసుకెళుతోంది.
అంతలా ఆకట్టుకుంటోన్న ఈ పాటను మీరు ఇక్కడ చూడొచ్చు..