HeadLines

'పేపర్ బాయ్' టీజర్ టాక్.. బీటెక్ కుర్రాడి ప్రేమకథ



దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా రూపొందిస్తోన్న రెండో సినిమా 'పేపర్ బాయ్'. గతంలో ఆది హీరోగా 'గాలిపటం' అనే సినిమా నిర్మించాడు సంపత్ నంది. 'తను-నేను' ఫేం సంతోష్ శోభన్ హీరోగా జయ శంకర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తానే కథ, కథనాలు అందిస్తున్నడు సంపత్. రియా సుమన్, తాన్యా హోప్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను నేడు విడుదల చేశారు.

బిటెక్ చదివి పేపర్ బాయ్ గా వర్క్ చేస్తోన్న ఓ యువకుడి ప్రేమకథే ఈ సినిమా. న్యూస్ పేపర్ లోని కొన్ని పదాలను పెన్ తో అండర్ లైన్ చేసి తన ప్రేమకథను పరిచయం చేయడం టీజర్ లో ప్రధానంగా ఆకట్టుకుంటోంది. భీమ్ అందించిన ఫీల్ గుడ్ మ్యూజిక్, సౌందర రాజన్ సినిమాటోగ్రఫీ లవ్ స్టోరీని ఎలివేట్ చేస్తున్నాయి. మొత్తానికి టీజర్ తో 'పేపర్ బాయ్' ఇంప్రస్ చేసినట్టే. ఈ టీజర్ ను మీరూ చూడండి..