HeadLines

త్రివిక్రమ్ మూవీ మొదలుపెట్టేసిన పవన్





పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. పవన్ కూడా ఈ మూవీ సెట్స్ లోకి ఈరోజే ఎంటరవడం విశేషం. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఈ మూవీ కోసం ఓ భారీ సెట్ నిర్మించారు. పవన్ సెట్స్ లో ఎంటరవడంతో షూటింగ్ లో సందడి నెలకొంది. ‘కాటమరాయుడు‘లో మాస్ లుక్ లో కనిపించిన పవన్.. ఈ మూవీలో క్లీన్ షేవ్ తో స్టైలిష్ గా కనిపించబోతున్నాడు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్, హీరోయిన్స్ కీర్తిసురేశ్, అనూ ఇమాన్యూయల్ మధ్య సాగే సన్నివేశాలను త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ‘సర్దార్ గబ్బర్ సింగ్‘, ‘కాటమరాయుడు‘ చిత్రాలు నిరాశ పరచడంతో పవన్ అభిమానులు ఈ సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. జల్సా.. అత్తారింటికి దారేది తర్వాత పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న మూడో చిత్రం కావడంతో... హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే అంచనాలు నెలకొన్నాయి.