HeadLines

రామ్ చరణ్ సెట్ కు సమంత వచ్చేసిందినాగచైతన్యతో ఎంగేజ్ మెంట్ తర్వాత తెలుగులో సమంత అంగీకరించే స్టార్ హీరోల సినిమాల సంఖ్య చాలా వరకు తగ్గింది. అయితే.. తమిళంలో మాత్రం సినిమాలకు సైన్ చేసింది. ఒకానొక సందర్భంలో ఇకపై తెలుగులో సమంత నటించదేమో అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ వీటన్నింటికీ చెక్ పెడుతూ ఇప్పటికే 'సావిత్రి', ''రాజుగారి గది-2' చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తోన్న సమంత.. ఇప్పుడు రామ్ చరణ్ సరసన కూడా నటిస్తోంది.

‘జనతాగ్యారేజ్’ తర్వాత సమంత సైన్ చేసిన స్టార్ హీరో సినిమా రామ్ చరణ్ దే. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా.. జగపతిబాబు, ఆది పినిశెట్టి కీలకపాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్ గత చిత్రాల తరహాలో రత్నవేలు సినిమాటోగ్రఫీ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ మూవీకి తోడవుతున్నాయి.

పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రాజమండ్రి పరిసరప్రాంతాల్లో ఈ శనివారమే మొదలైంది. నెలరోజుల పాటే గోదావరి జిల్లాలలోని పలు ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ జరుపుకోనుండగా.... సోమవారం నుంచి సమంత ఈ షూటింగ్ లో జాయిన్ అవుతోంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రామ్ చరణ్, సమంత జంటపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తోన్న తొలిచిత్రం ఇదే కావడం విశేషం.