అఖిల్ సెకండ్ మూవీ మొదలెట్టేసాడు
అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ఈ రోజు ప్రారంభమైంది. అన్నపూర్ణ
స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నాగార్జున, అమల, నాగచైతన్య,
అఖిల్, విక్రమ్ కుమార్ తో పాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ కార్యక్రమంలో
పాల్గొన్నారు.
ఏప్రిల్ 3 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు
నాగార్జున ఈ సందర్భంగా తెలియజేసాడు. అఖిల్ సరసన హీరోయిన్ గా మేఘా ఆకాశ్ పేరు
వినిపిస్తున్పటికీ ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ‘మనం‘ వంటి సూపర్
హిట్ ను అందించాడన్న నమ్మకంతో అఖిల్ సెకండ్ మూవీ బాధ్యతను విక్రమ్ కుమార్ పై
ఉంచాడు నాగార్జున. సెకండ్ మూవీతోనైనా అఖిల్ హీరోగా సక్సెస్ అవుతాడని ఆశిద్దాం..