HeadLines

రజనీకే కాదు చిరుకి విలన్ అతడే..! ‘ఖైదీ నెం 150’ తర్వాత చిరంజీవి నటించబోతున్న చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి'. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించనున్న ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించబోతున్నాడట.

 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి'లోని ఓ కీలకమైన పాత్రకు అక్షయ్ కుమార్ ను సంప్రదిస్తున్నారట. అక్షయ్ పోషించబోయేది ఎలాంటి క్యారెక్టర్ అనేది ప్రస్తుతానికి సస్పెన్స్  అయినప్పటికీ.. విలన్ క్యారెక్టర్ కోసమే అక్షయ్ ను తీసుకోబోతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఆల్రెడీ రజనీకాంత్ మూవీ '2.0'లో అక్షయ్ కుమార్ మెయిన్ విలన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే. మరి.. రజనీకాంత్ తో పాటు చిరంజీవికి కూడా అక్షయే విలన్ అయినా ఆశ్చర్యపోనక్కరలేదేమో..!