HeadLines

'బిచ్చగాడు' హీరో సరసన అంజలి


తెలుగులో అవకాశాలు తగ్గిన అంజలి.. గతంలో తనను హీరోయిన్ గా నిలబెట్టిన తమిళ చిత్రసీమపైనే తిరిగి దృష్టి సారించింది. జైతో కలసి అంజలి నటించిన 'బెలూన్' చిత్రం ఈ నెల 27న విడుదల కానుండగా... మరో కొన్ని చిత్రాలు లైన్ లో ఉన్నాయి. ఇక తాజాగా విజయ్ ఆంటోనీ సరసన ఓ కొత్త చిత్రంలో నటిస్తోంది అంజలి.

'బిచ్చగాడు' సినిమాతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ.. అతి త్వరలో 'అన్నాదురై' (తెలుగులో 'ఇంద్రసేన') చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ సినిమా పూర్తవక ముందే 'కాళి' అనే మరో మూవీలో నటిస్తున్నాడు విజయ్ ఆంటోని. నలుగురు హీరోయిన్స్ ఈ చిత్రంలో నటిస్తుండగా.. అంజలి మెయిన్ లీడ్ గా నటించబోతోంది.

మిగతా హీరోయిన్స్ గా సునైన, అమృత, శిల్పా మంజూనాథ్ నటిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాకు ఉదయనిధి స్టాలిన్ భార్య కృతిక దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ ఆంటోని, అంజలి కలసి నటించడం ఇదే తొలిసారి. డిసెంబర్ లో విడుదల కానున్న ఈ మూవీతో.. రెండు భాషల్లోనూ తనకు విజయం లభిస్తుందని భావిస్తోందట అంజలి.