అలాంటి హెచ్చరికలు 'స్పైడర్'కు అక్కరలేదు
సినిమా ప్రారంభానికి ముందు.. మధ్యపానం, ధూమపానం గురించి ఓ రెండు నిముషాల ప్రకటన తప్పనిసరిగా చూస్తుంటాం. ఇక సినిమాల్లో డ్రింకింగ్, స్మోకింగ్ సీన్స్ వచ్చేటప్పుడు తప్పనిసరిగా `మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం` అంటూ చట్టబద్దమైన హెచ్చరిక స్క్రీన్ క్రింది భాగంలో కనిపిస్తుంటుంది. దాదాపుగా అన్ని సినిమాలకు ఇది కామన్. అయితే.. 'స్పైడర్' సినిమా విషయంలో ఇలాంటి హెచ్చరికలు అవసరం లేదట.
'స్పైడర్' సినిమాలో హీరో మహేశ్ బాబు గానీ.. విలన్ గా నటించిన ఎస్.జె.సూర్య గానీ మందు తాగుతున్నట్టు, సిగరెట్ తాగుతున్నట్టుగా ఒక్కటంటే ఒక్క సీన్ కూడా లేదట. పైగా.. మద్యపానం వంటి దురలవాట్లకు బదులుగా విలన్ సైతం గ్రీన్ టీ తాగుతూ ఆరోగ్య సూత్రాలు పాటిస్తుంటాడట. ఆమధ్య ఈ విషయాన్ని మురుగదాస్ స్వయంగా వివరించాడు. తాజాగా హిందీ వెర్షన్ విషయంలో ఈ తరహా హెచ్చరికలు అవసరం లేదనే ఆమోద ముద్ర కూడా లభించిందట.
సినిమా ప్రభావం ప్రేక్షకులపై తప్పకుండా ఉంటుందని తాను నమ్ముతానని.. అందుకే బ్యాడ్ హ్యాబిట్స్ ను ప్రమోట్ చేసే సీన్స్ ను ఏ రూపంలోనూ తన సినిమాలో ఉంచేందుకు ఒప్పుకోనని దర్శకుడు మురుగదాస్ చెపుతున్నాడు. రియలిస్టిక్ సీన్స్ పేరుతో నానా వ్యసనాలను ప్రేక్షకులపై రుద్దే దర్శకులు.. మురుగదాస్ వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనడంలో సందేహం లేదు.