HeadLines

చైతుకు ఎడమ చేయి ఆదీనంలో ఉండదట


'యుద్ధం శరణం' చిత్రంతో ఈరోజు ప్రేక్షకుల ముందుకొస్తోన్న నాగచైతన్య.. మరోవైపు చందు మొండేటి దర్శకత్వంలో తన తదుపరి చిత్రానికి కమిట్ అయ్యాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు 'సవ్యసాచి' అనే టైటిల్ ను ఇప్పటికే ఖరారు చేశారు. ఈ సినిమాలో చైతూ క్యారెక్టర్ డిఫరెంట్ ఉండబోతోందట. చైతూ రైట్ హ్యాండ్ కు ఉండేంత పవర్.. లెఫ్ట్ హ్యాండ్ కు కూడా ఉంటుందట. అందుకే ఈ టైటిల్ పెట్టారట. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.

ఈ సినిమాలో చైతూ రెండు చేతులు సరిసమానంగా పనిచేయగలవు. ఇదేమి పెద్ద విశేషం కాదు. మనలోనూ రెండు చేతులతో సరిసమానంగా పనిచేసేవారు కొందరుంటారు. కానీ.. 'సవ్యసాచి'కి మాత్రం లెఫ్ట్ హ్యాండ్ బ్రెయిన్ కంట్రోల్ లో ఉండదట. మెదడు నియంత్రణతో పనిలేకుండా దానంతట అని పనిచేస్తూ ఉంటుందట.

శరీరంలోని ఒక అవయవం మనిషి అధీనంలో లేకుండా పోతే ఎలా ఉంటుదన్నదే ఈ సినిమాలో కీలక అంశమని తెలుస్తోంది. ఈ రేర్ మెడికల్ కండిషన్ ను 'ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్' అంటారు. ఈ తరహా కథతో ఇండియలో వస్తోన్న రెండో చిత్రం ఇది. ఈ ఏడాది జూన్ లో 'పీచంకయ్' అనే తమిళ సినిమా కూడా ఇదే డిసార్డర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇక అక్కినేని జయంతి సందర్భంగా ఈ నెల 20న 'సవ్యసాచి' సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.