రిలీజ్ డేట్ మార్చుకుంటోన్న నితిన్ సినిమా
‘ఛల్ మోహన్ రంగ’ సినిమాతో మరో పరాజయాన్ని అందుకున్న నితిన్.. ప్రస్తుతం 'శ్రీనివాస కళ్యాణం' చిత్రంలో నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో నితిన్ సరసన రాశీఖన్నా, నందిత శ్వేత నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
'ఫిదా' సెంటిమెంట్ దృష్ట్యా.. జులై-21న 'శ్రీనివాస కళ్యాణం'ను విడుదల చేయాలని భావించిన నిర్మాత దిల్ రాజు.. ఇప్పుడు రిలీజ్ డేట్ ను ఆగస్టుకు వాయిదా వేసే యోచనలో ఉన్నారట. ఇందుకు కారణం.. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతోన్న మరో చిత్రం 'లవర్స్'. రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా జులైలో విడుదల కానుండడంతో.. 'శ్రీనివాస కళ్యాణం'ను ఆగస్టుకు పోస్ట్ పోన్ చేయనున్నట్టు తెలుస్తోంది.