HeadLines

సాయిధరమ్ తమ్ముడిపై వచ్చిన వార్తలన్నీ రూమర్లే


సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్నాడనే ప్రచారం గత కొద్దిరోజులుగా జోరందుకుంది. ప్రముణ నిర్మాణ సంస్థ 'వారాహి చలనచిత్రం' ఈ సినిమాను నిర్మించనుందనేది ఈ ప్రచారం సారాంశం. కానీ ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని.. అవి ఒట్టి రూమర్స్ మాత్రమేనని నిర్మాత సాయికొర్రపాటి కొట్టిపారేశారు. చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం ఓ సినిమాను నిర్మిస్తోన్న సాయి కొర్రపాటి.. వైష్ణవ్ తేజ్ సినిమాపై పై విధంగా క్లారిటీ ఇచ్చారు. మరి.. ఈ యువహీరోను ఎవరు లాంఛ్ చేయనున్నారో వేచిచూడాలి..!