HeadLines

బికినీ ఫొటోలపై మండిపడ్డ నివేద...

‘మెంటల్ మదిలో’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన తమిళ భామ నివేదా పేతురాజ్.. ఇప్పుడు బికినీ ఫొటోలపై మండిపడుతోంది. ఇందుకు కారణం ఈ ఫొటోలు నివేదకి కాకపోవడమే. గతంలో తమిళనాట దుమారం రేపిన ''సుచీ లీక్స్' సమయంలోనూ నివేద ఫేక్ న్యూడ్ వీడియో ఒకటి సంచలనం రేపింది. అది మర్చిపోకముందే.. నివేదా పేతురాజు బికినీ స్టిల్స్ పేరుతో కొన్ని ఫొటోస్ తమిళ వెబ్ సైట్స్ లో ప్రత్యక్షమయ్యాయి.

నిజానికి ఆ ఫొటోస్ వర్షిణి పాకాల్‌ అనే మోడల్ కు సంబంధించినవి కాగా.. నివేదా పేతురాజు పేరుతో ప్రచారంలోకి వచ్చాయి. ఈ విషయం నివేదకు తెలిసేలోపే జరగాల్సిన నష్ట జరిగిపోయింది. దీంతో మండిపడ్డ నివేద.. ఈ విషయంపై సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మీడియాపై తనకు ఎంతో గౌరవం ఉందని.. కానీ ఇలాంటి బాధ్యతతారాహిత్య చర్యలను మాత్రం ఉపేక్షించేది లేదని.. న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని నివేదా పేతురాజ్ హెచ్చరించింది.