HeadLines

మరో సీనియర్ నటి బయోపిక్ లో కీర్తి సురేశ్..?

తెలుగు, తమిళ భాషల్లో బిజీ అవుతోన్న కీర్తి సురేశ్.. మరికొద్ది గంటల్లో 'మహానటి' సినిమాతో జనం ముందుకొస్తోంది. అలనాటి అందాల నటి సావిత్రిగా కీర్తి కనువిందు చేయడం ఖాయమంటున్నారు 'మహానటి' టీమ్. ఇదిలా ఉంటే.. మరో బయోపిక్ లో కీర్తీ సురేశ్ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకూ ఆ బయోపిక్ మరెవరో కాదు ఒకప్పుడు హీరోయిన్ గా ఆకట్టుకుని.. ఆ తర్వాత రాజకీయాలను శాసించే స్థాయిని అందుకున్న జయలలిత.

త్వరలో తాను ఓ తమిళ బయోపిక్ లో నటించబోతున్నానని.. ఆ డిటైల్స్ మరికొన్ని రోజుల్లో రివీల్ చేస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేశ్ చెప్పింది. బహుశా.. ఆ బయోపిక్ జయలలితదే అయ్యి ఉంటుందనే ప్రచారం జోరందుకుంది. సావిత్రి జీవితం తరహాలోనే జయలలిత జీవితంలోనూ ఎన్నో ఆసక్తికర సంఘటనలు, రాజకీయ కోణాలు ఉన్నాయి. పైగా.. జయలలిత పొలిటీషియన్ కూడా కావడంతో ఈ సినిమాపై ప్రారంభానికి ముందునుంచే అంచనాలు ఏర్పడుతున్నాయి.