క్యాస్టింగ్ కౌచ్‌పై సమంత స్పందన
గత రెండు నెలలుగా తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న ‘క్యాస్టింగ్ కౌచ్’ వివాదంపై టాలీవుడ్ స్టార్ హీరోయన్ సమంత స్పందించింది. తనకు ఫస్ట్ మూవీనే హిట్ రావడంతో.. ఆ తర్వాత ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు పెద్దగా కష్టపడలేదని.. అయితే గత ఎనిమిదేళ్లుగా తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్నప్పటికీ.. తనకు అలాంటి అనుభవాలు మాత్రం ఎప్పుడూ ఎదురు కాలేదని చెప్పింది సమంత.
క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితం కాదన్న సమంత... అమ్మాయిల బలహీనతలను ఆసరాగా తీసుకుని వాడుకునే నీచులు అన్ని రంగాల్లోనూ ఉంటారని సమంత తెలిపింది. ఈ విషయంలో కేవలం సినిమా పరిశ్రమనే టార్గెట్ చేయడం సరికాదంది సమంత. మంచి, చెడులు ఎక్కడైనా ఉంటాయని.. కానీ చెడును ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని.. తాను చూసినంతవరకూ మాత్రం ఇండస్ట్రీలో ఎక్కువగా మంచే ఉందని సమంత చెప్పింది. తనకు పిల్లలు పుట్టినా నటిస్తూనే ఉంటానని.. భవిష్యత్తులో తన పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి రావొచ్చని సమంత ఈ సందర్భంగా తెలియజేసింది.