HeadLines

సమంత vs సమంత.. ఒకే రోజున రెండు సినిమాలతో


'రంగస్థలం'తో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న సమంత.. ఈ నెల 9న 'మహానటి' సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. తమిళంలో 'నడిగర తిలగం' పేరుతో ఈ నెల 11న విడుదల కాబోతోంది. అదేరోజున సమంత నటించిన మరో సినిమా కూడా తమిళంలో రిలీజ్ కానుండటం విశేషం.

విశాల్ -సమంత జంటగా నటించిన తమిళ చిత్రం 'ఇరుంబు తిరై' గత కొన్నాళ్లుగా వరుస వాయిదాలు పడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాను ఈ నెల 11న తమిళంలో విడుదల చేయాలని ఫిక్స్ చేశాడు విశాల్. అయితే... తెలుగులో మాత్రం ఈనెల 17న విడుదల కానుంది. దీంతో తెలుగులో కాకపోయినా... తమిళంలో సమంత నటించిన రెండు సినిమాలూ ఒకే రోజున విడుదల కాబోతున్నట్టైంది.