HeadLines

మహేశ్ కాకపోతే మరొకరితోనైనా చేస్తా: పూరి

రిజల్ట్ మాటెలా ఉన్నా ఈమధ్య మన తెలుగులో దేశభక్తి నేపథ్యంలో 'జవాన్', 'నా పేరు శివ' వంటి చిత్రాలు వచ్చాయి. దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా కొన్నేళ్ల క్రితం ఇలాంటి కథతోనే 'జనగణమన' అనే సినిమా ప్లాన్ చేశాడు. మెహబూబా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన పూరి.. 'జనగణమన' సినిమా గురించి ప్రస్తావించారు.

'బిజినెస్ మేన్' సినిమా తర్వాత వెంటనే మహేశ్ తోనే 'జనగణమన' ప్లాన్ చేశానని చెప్పిన పూరి.. మహేశ్ ఎటూ తేల్చకపోవడం ఈ సినిమా స్టార్ట్ అవలేదన్నాడు. మహేశ్ చేసినా, చేయకపయినా ఈ సినిమా మాత్రం ఆగదని మరో హీరోతో అయినా దీన్ని తీస్తానని పూరి ఈ సందర్భంగా తెలియజేశాడు. భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే ఏం చేయాలన్నదే 'జనగణమన' కథాంశమని.. సమాజానికి ఇలాంటి చిత్రం ఎంతో అవసరమని పూరి తెలిపారు.