HeadLines

శ్రీదేవి పాట వస్తోంది..!


శ్రీదేవి చివరి సినిమా అనగానే ‘మామ్‌’ గుర్తొస్తుంది. కానీ షారుక్‌ ఖాన్‌ ‘జీరో’ సినిమాలో శ్రీదేవి కనిపించబోతోంది. మరుగుజ్జు పాత్రలో షారుఖ్ నటించిన ఈ మూవీపై ట్రైలర్ అండ్ సాంగ్స్‌తో అంచనాలు పెరిగాయి. అయితే ఇంకా విడుదల కానీ ఓ పాటలో బాలీవుడ్ స్టార్స్ అంతా మెరిశారట. అందులో శ్రీదేవి కూడా ఉండటం విశేషం.

‘జీరో’ సినిమాలో ఓ పార్టీ సాంగ్‌ ఉంది. ఆమీర్‌ఖాన్‌,  సల్మాన్‌ఖాన్‌, కాజోల్‌, కరీనాకపూర్‌, అలియా భట్‌ వంటి తన సన్నిహితులందరినీ ఈ పాటలో నటింపజేశాడట షారుఖ్. ఇదే పాటలో శ్రీదేవి కూడా మెరిసినట్టు తెలుస్తోంది. అలాగని గ్రాఫిక్స్ గట్రా కాదండోయ్. శ్రీదేవి మరణానికి ముందే ఈ పాటను చిత్రీకరించారు. అందుకే ఈ పాటలో శ్రీదేవి కనిపించబోతోంది. ఆ అతిలోక సుందరి కనిపించేది కొన్ని సెకన్లే అయినా అభిమానులకు అది సమ్మోహనమే. సో.. శ్రీదేవి ఫ్యాన్స్ మరోసారి తమ ఫేవరేట్‌ స్టార్‌ను చూడాలంటే డిసెంబర్‌ 21 వరకూ ఆగాల్సిందే..!