HeadLines

బాలీవుడ్ కు చిరు ‘ఖైదీ నెంబర్ 150'


సంక్రాంతికి వచ్చిన ‘ఖైదీ నెంబర్ 150' చిరంజీవి రీ-ఎంట్రీకి బాగానే హెల్ప్ అయింది. తమిళంలో మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ నటించిన హిట్ మూవీ ‘కత్తి‘కి ఇది రీమేక్. తమిళ, తెలుగు భాషల్లో హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ కు కూడా వెళ్లబోతోంది.

‘కత్తి‘ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి కొన్నాళ్లుగా మురుగదాస్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ ఈ రీమేక్ లో నటిస్తారనే టాక్ వచ్చినప్పటికీ వర్కవుట్ అవలేదు. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ లో నటించడానికి హృతిక్ రోషన్ ఆసక్తి చూపుతున్నాడట.

చిరంజీవికి ‘కత్తి‘ రీమేక్ తెలుగులో మంచి విజయాన్ని ఇవ్వడంతో హృతిక్ చూపు ఈ సినిమాపై పడింది. 'మొహెంజోదారో' .. 'కాబిల్' సినిమాల పరాజయంతో ఢీలా పడ్డ హృతిక్ రోషన్.. సల్మాన్ ఖాన్ తరహాలో సౌత్ రీమేక్స్ తో సక్సెస్ సాధించాలనే ప్లాన్ లో ఉన్నాడట. మరి.. మురుగదాసే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడా.. లేక మరో దర్శకుడా అన్నది తేలాల్సి ఉంది.