ఎన్టీఆర్ సినిమా ఆ రీమేక్ కాదట
ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందే చిత్రం రీసెంట్ గా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు డిఫరెంట్ రోల్స్ లో నటిస్తుండగా.. వీటిలో ఓ పాత్ర కోసం ఇటీవల హాలీవుడ్ మేకప్ టెక్నీషియన్ వర్క్ చేస్తున్నాడు. ఈ త్రిబుల్ రోల్ వ్యవహారం విన్నవారంతా.. ఇదేదో తమిళంలో వచ్చిన అజిత్ సినిమాకు రీమేక్ అనుకున్నారు.
పదేళ్లక్రితం తమిళంలో వచ్చిన ‘వరలారు‘ అనే సినిమాలో అజిత్.. తండ్రి ఇద్దరు కొడుకులుగా త్రిబుల్ రోల్ లో నటించాడు. ఎన్టీఆర్ సినిమా ఈ తమిళ చిత్రానికి రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది. అయితే.. చిత్రయూనిట్ ఈ వార్తలను ఖండించింది. అజిత్ సినిమాతో తమ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని.. ఇది బాబీ తయారు చేసిన వినూత్నమైన స్టోరీ అని క్లారిటీ ఇచ్చారు. సినిమా విడుదలయ్యేలోపు ఇలాంటి వార్తలు ఇంకెన్ని రానున్నాయో మరి..!