HeadLines

టీజర్ తో అదరగొట్టేస్తున్న 'విక్రమ్ వేద'


‘పిజ్జా‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించాడు కోలీవుడ్ యువహీరో విజయ్ సేతుపతి. విలక్షణ నటుడిగా డిఫరెంట్ మూవీస్ ట్రై చేస్తున్నాడీ యంగ్ హీరో. ఇక మాధవన్ ఎప్పటి నుంచి తెలుగువారికి సుపరిచితుడే. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో ‘విక్రమ్ వేద‘ పేరుతో ఓ తమిళ చిత్రం తెరకెక్కుతోంది. శివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ మూవీ టీజర్ కోలీవుడ్ లో దుమ్ము రేపుతోంది.

ఈ టీజర్ లో గ్యాంగ్ స్టర్ గా విజయ్ సేతుపతి .. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా మాధవన్ కనిపిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో పోటాపోటీగా సాగే యాక్షన్ సీన్స్ పై ఈ టీజర్ ను కట్ చేశారు. రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ లో ఈ టీజర్ కు ఏడున్నర లక్షలకి పైగా హిట్స్ రావడం విశేషం. పుష్కర్ - గాయత్రి సంయుక్త దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది.