HeadLines

విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటి


మహేశ్ బాబు సినిమాతో బిజీగా ఉన్న మురుగదాస్.. ఈ మూవీ తర్వాత విజయ్ హీరోగా మరో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో ‘తుపాకి‘, ‘కత్తి‘ వంటి భారీ విజయాలు ఉండగా.. ఈ అప్ కమింగ్ మూవీతో హ్యాట్రిక్ కొట్టాలన్నది మురుగదాస్ ప్లాన్. ఇందుకోసం బాలీవుడ్ బ్యూటీని కూడా రంగంలోకి దింపుతున్నాడట మురుగదాస్.

విజయ్ హీరోగా తాను తెరకెక్కించబోయే చిత్రంలో సోనాక్షి సిన్హాను హీరోయిన్ గా తీసుకుంటున్నాడట మురుగదాస్. ఈ కోలీవుడ్ డైరెక్టర్ తీసిన బాలీవుడ్ మూవీ ‘అకీరా‘లో సోనాక్షి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఆ అనుబంధం కొద్దీ మురుగదాస్ అడిగిందే తడవుగా ఓకే చెప్పేసిందట సోనాక్షి. పైగా సోనాక్షికి కోలీవుడ్ కొత్తేమి కాదు. ఆ మధ్య రజనీకాంత్ సరసన ‘లింగా‘ సినిమాలో నటించిందిగా..! కోలీవుడ్ సినిమా అంటే కాస్త భయపడినా.. మురుగదాస్ పై ఉన్న కాన్ఫిడెంట్ తో ఓకే చెప్పేసిందట.