HeadLines

మహేశ్ ఫస్టులుక్ ఇంకెప్పుడు మురుగా..?


మహేశ్ బాబు వంటి స్టార్ హీరో సినిమా అంటే ప్రతీ చిన్న అప్ డేట్ విషయంలోనూ ఆసక్తి ఉండటం సహజం. అయితే.. మహేశ్ లేటెస్ట్ మూవీ విషయంలో ఇంతవరకూ టైటిల్, ఫస్ట్ లుక్ వంటివి ఏ ఒక్కటీ విడుదల చేయకుండా అభిమానుల్లో ఆతృత పెంచుతున్నాడు దర్శకుడు మురుగదాస్. శివరాత్రికైనా ఈ సినిమా ఫస్ట్ లుక్ వస్తుందని ఆశించిన అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది.

ఫస్ట్ లుక్ ఎప్పుడు విడుదల చేసేదీ చెప్పలేదు కానీ.. అప్పుడే రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేసేశాడు మురుగదాస్. "మా అతిథులుగా మారడానికి సిద్ధంగా వుండండి .. జూన్ 23వ తేదీన వచ్చేస్తున్నాం" అంటూ మురుగదాస్ రీసెంట్ గా ట్వీట్ చేశాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో.. మరో హీరో సేమ్ డేట్ ఫిక్స్ అవకుండా రిలీజ్ డేట్ లాక్ చేసేశాడు మురుగదాస్.

మహేశ్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం అభిమానులకు గుడ్ న్యూస్ అయినప్పటికీ.. ఫస్ట్ లుక్ విషయంలో మాత్రం వారు ఇప్పటికీ మురుగదాస్ పై గుర్రుగానే ఉన్నారు. అయితే.. మురుగదాస్ వెర్షన్ మరోలా ఉంది. సినిమా షూటింగ్ 90 పర్సంట్ కంప్లీట్ అయితేనే కానీ.. ఫస్ట్ లుక్ విడుదల చేయడట. ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగానే ప్రమోషన్ లో వేగం పెంచేసి.. వరుసగా టీజర్, ట్రైలర్, ఆడియోతో అందరినీ తమ సినిమా వైపుకు తిప్పుకోవాలన్నది మురుగదాస్ మాస్టర్ ప్లాన్ అని తెలుస్తోంది.