యాంకర్ రవి.. హీరో అవుతున్నాడు
బుల్లితెర భామలంతా ఇప్పుడు హీరోయిన్స్ గానూ మురిపిస్తున్నారు. తెలుగు టీవీ ఛానల్స్ ను తమ గ్లామర్ తో నింపేసిన అనసూయ, రష్మీ, శ్రీముఖి వంటి అందగత్తెలంతా కథానాయికలుగానూ బిజీ అయ్యారు. ఇప్పుడీ బాటలో మేల్ యాంకర్ రవి కూడా సిల్వర్ స్క్రీన్ పై లక్ పరీక్షించుకుంటున్నాడు.
రవి హీరోగా 'ఇది మా ప్రేమకథ' అనే సినిమా తెరకెక్కుతోంది. '1 ఈజ్ గ్రేటర్ దెన్ 99' అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ లో రవి సరసన ఇద్దరు కథానాయికలు మురిపించనున్నారు. అయోధ్య కార్తీక్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కానుంది. బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన మేల్ యాంకర్స్ లో శివాజీ, కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోలుగానూ మెప్పించారు. మరి.. రవి కూడా హీరోగా అదరగొట్టేస్తాడేమో చూడాలి..!