HeadLines

ఫస్ట్ లుక్ టాక్... జ్యోతిక రప్ఫాడించేస్తోంది..!


సూర్యతో వివాహం తర్వాత కొన్నేళ్లపాటు వెండితెరకు విరామం ఇచ్చిన జ్యోతిక.. గత కొద్ది కాలంగా వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ప్రస్తుతం ‘మొగలిర్ మట్టుమ్’ అనే సినిమాలో నటిస్తున్న జ్యోతిక.. మరోవైపు సంచలన చిత్రాల దర్శకుడు బాల దర్శకత్వంలోనూ ఓ సినిమాలో నటిస్తోంది. గతంలో సూర్య కూడా బాల దర్శకత్వంలో 'శివ పుత్రుడు' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

‘నాచ్చియార్’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను సూర్య ట్విట్టర్ ద్వారా ఆవిష్కరించాడు. ఈ పోస్టర్ లో రఫ్ అండ్ టఫ్ లుక్ లో కనిపిస్తోంది జ్యోతిక. ఇళయరాజ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జ్యోతికతో పాటు జీవి ప్రకాష్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. సూర్యతో పాటు జీవీ ప్రకాష్ కూడా మరో పోస్టర్ రిలీజ్ చేశాడు. ఇందులో జీవీ ఊరమాస్ లుక్ లో కనిపిస్తుంటే.. జ్యోతిక ఓ పసికందుకు స్నానం చేయిస్తోంది.



వైవిధ్యభరితమైన కథాంశాలకి ప్రాధాన్యతనిచ్చే బాల నుంచి వస్తోన్న సినిమా అంటేనే ఓ క్యూరియాసిటీ ఉంటుంది. పైగా ఇప్పుడీ సినిమాలో జ్యోతిక కూడా నటిస్తోంది. పైగా విడుదలైన రెండు పోస్టర్స్ వేటికవే డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. రీ-ఎంట్రీలో సక్సెస్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తోన్న జ్యోతికకు.. బాల అయినా హిట్ ఇస్తాడేమో చూద్దాం..!