HeadLines

చైతూ పెళ్ళి కోసం అన్నపూర్ణలో భారీ సెట్



నాగచైతన్య పెళ్లి కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఓ భారీ సెట్ వేస్తున్నారట. ఈ సెట్ లోని ఒక్కో భవంతికి రూ. 60 లక్షల పైనే ఖర్చు అవుతోందట. ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ ఈ సెట్టింగ్స్ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారట. కాకపోతే.. ఇది సమంతతో చైతూ రియల్ లైఫ్ మ్యారేజ్ కోసం వేస్తున్న సెట్ కాదు... చైతూ తాజా చిత్రం షూటింగ్ కోసం వేస్తున్న సెట్.

 ప్రస్తుతం ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో ఒక సినిమాలో నటిస్తున్నాడు నాగచైతన్య. రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో చైతూ సరసన నటిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరితో పెళ్లి కోసం సెట్ వేస్తున్నారో తెలియదు కానీ... పెళ్లి నేపథ్యంలో రెండు భారీ భవంతుల సెట్స్ నిర్మాణం మాత్రం జరుగుతోంది. నాగార్జునకు 'నిన్నే పెళ్లాడతా' తరహాలో.. చైతూ కెరీర్ లో ఈ సినిమా నిలిచిపోతుందంటున్నారు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. సినిమా పెళ్లి సంగతి ఇలా ఉంటే.. మరి ఈ అక్కినేని వారబ్బాయి రియల్ లైఫ్ మ్యారేజ్ కు ఎప్పుడు రెడీ అవుతున్నాడో...!