HeadLines

అది నిజం కాదంటోన్న వినాయక్


మంచు మనోజ్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కబోతోందని.. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తయ్యాయనే ప్రచారం ఇటీవల జోరందుకుంది. ఈ ప్రచారం ఆనోటా ఈనోటా పడి వినాయక్ వరకూ వెళ్లడంతో ఈ విషయంపై ఆయనే స్వయంగా స్పందించాడు. జస్ట్ ఇదంతా ఓ పుకారు మాత్రమేననీ, ఇందులో వాస్తవం లేదంటూ క్లారిటీ ఇచ్చాడు.

ఇటీవల తిరుపతిలో జరిగిన మోహన్ బాబు బర్త్ డే వేడుకలకు వినాయక్ కూడా హాజరయ్యాడు. ఈ ఫంక్షన్ లో వినాయక్ లో ఎక్కువగా మంచు మనోజ్ తోనే ఎక్కువగా కనిపించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. వినాయక్ స్పందించి క్లారిటీ ఇవ్వడంతో... రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడింది. ఇలాంటి రూమర్స్ పై దర్శకులంతా వినాయక్ తరహాలో స్పందిస్తే.. ఇండస్ట్రీలో ఈ తరహా అనవసర ప్రచారాలు తగ్గుముఖం పడతాయిగా..!