HeadLines

షూటింగ్ లో గాయపడ్డ సంజయ్ దత్


అక్రమాయుధాల కేసులో జైలుకు వెళ్లి తిరిగొచ్చిన సంజయ్ దత్.. ప్రస్తుతం 'భూమి' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జరుగుతోంది. సినిమాలో కీలకమైన యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా.. సంజయ్ దత్ గాయపడ్డాడు.

సాధారణ గాయం అని భావించిన సంజయ్ దత్.. తాత్కాలిక ఉపశమనానికి పెయిన్ కిల్లర్స్ వాడి ఆ ఫైట్ సీన్ ను కంప్లీట్ చేశాడు. కానీ ఆ తర్వాత కూడా నొప్పి ఎక్కువవడంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకున్నాడట సంజయ్ దత్. పక్కటెముక విరిగినట్టు దృవీకరించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. దీంతో.. ప్రస్తుతం 'భూమి' మూవీ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. బహుశా.. ఈ నెలాఖరుకు సంజయ్ దత్ కోలుకోవచ్చునని భావిస్తున్నారు.