వాయిదా పడ్డ వర్మ 'సర్కార్-3'
అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో 'సర్కార్' సిరీస్ లో వస్తోన్న మూడో సినిమా 'సర్కార్-3'. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఏప్రిల్-7వ తేదీన విడుదల కాబోతున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆ డేట్ కు రావడం లేదట. మే నెలకు వాయిదా పడ్డట్టు తెలుస్తోంది.
షూటింగ్ స్పీడుగానే పూర్తయిన 'సర్కార్-3' మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో జాప్యం కారణంగా ఆలస్యమవుతోందట. దీంతో మే-12న విడుదల చేయబోతున్నట్టు ఈ మూవీ నిర్మిస్తోన్న ఈరోస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. జాకీష్రాఫ్, మనోజ్ బాజ్ పాయ్, యామీ గౌతమ్ ఈ సినిమాలో కీలకపాత్రను పోషిస్తున్నారు.