రిస్క్ చేస్తోన్న కాజల్ అగర్వాల్
నయనతార, అనుష్క, త్రిష వంటి మూడు పదుల వయసు దాటిన హీరోయిన్స్ అంతా లేడీ ఓరియంటెడ్ సినిమాలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ గ్లామర్ రోల్స్ తో మాత్రమే మెప్పించిన కాజల్ అగర్వాల్ కూడా ఇప్పుడో కథానాయిక ప్రాధాన్యత గల చిత్రంలో నటించేందుకు అంగీకరించిందట.
లేడీ ఓరియంటెడ్ సినిమాతో సక్సెస్ కొట్టడం ఆషామాషీ వ్యవహరమేం కాదు. ముందు సరైన కథను ఎంచుకోగలగాలి. సినిమా అంతా తన భుజాలపై వేసుకుని మెప్పించగలగాలి. తన సొంత ఇమేజ్ తో సినిమాకు హైప్ క్రియేట్ చేయగలగాలి. ఇవన్నీ చేయగలిగితేనే... లేడీ ఓరియంటెడ్ మూవీతోనూ కాజల్ సక్సెస్ అందుకోగలుగుతుంది. పైగా.. కాజల్ సినిమా డైరెక్ట్ చేయబోయేది ఓ ప్లాప్ డైరెక్టర్ కావడం మరో రిస్క్.
జీవా, కాజల్ జంటగా ”కావలై వెండం” అనే సినిమా తెరకెక్కించాడు దర్శకుడు డీకే. తెలుగులో 'ఎంత వరకు ఈ ప్రేమ' పేరుతో ఈ సినిమా డబ్ అయింది. రెండు భాషల్లోనూ ఈ మూవీ డిజాస్టరే. అయితే.. ఈ సినిమా టైమ్ లో దర్శకుడు చెప్పిన లేడీ ఓరియంటెడ్ స్టోరీ నచ్చడంతో అప్పట్లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్.. ఇప్పుడీ సినిమా మొదలెట్టబోతోందట. మరి.. కాజల్ తీసుకుంటున్న ఈ రిస్క్.. ఫస్ట్ లేడీఓరియంటెడ్ హిట్ ను అందిస్తుందో లేదో చూడాలి..!