HeadLines

సప్తగిరి హీరోగా 'రివాల్వర్ రాజు'


తనదైన మేనరిజం, కామెడీ టైమింగ్ తో అతి తక్కువ సమయంలో కమెడియన్ గా మంచి గుర్తింపు అందుకున్నాడు సప్తగిరి. ఈ యంగ్ కమెడియన్ తెరపై కనిపిస్తే చాలు విజిల్సే. 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' సినిమాతో కథానాయకుడిగానూ మంచి మార్కులేయించుకున్న సప్తగిరి.. ఇప్పుడు హీరోగా సెకండ్ మూవీ అనౌన్స్ చేశాడు.

 “రివాల్వర్ రాజు” అనే టైటిల్ తో హీరోగా తన సెకండ్ మూవీ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్టు సప్తగిరి ప్రకటించారు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాల్ని విడుదల చేస్తామని సప్తగిరి తెలిపారు. హీరోగా టర్న్ అయినప్పటికీ.. తనకు గుర్తింపును ఇచ్చిన కామెడీ రోల్స్ ను నిర్లక్ష్యం చేయకుండా కంటిన్యూ అవుతున్న సప్తగిరి.. ప్రస్తుతం నాగచైతన్య, శర్వానంద్, నాగ అన్వేష్ సినిమాల్లో కమెడియన్ గా నటిస్తున్నాడు.