HeadLines

బాహుబలి తర్వాత మరోసారి కలసి..



ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్థాయిని అందుకున్న అనుష్క, తమన్నా.. ‘బాహుబలి‘ సినిమాలో కలసి నటించిన విషయం తెలిసిందే. రాబోయే ‘బాహుబలి 2‘లోనూ ఈ ఇద్దరు కలసి కనిపించబోతున్నారు. అయితే.. ఇది బాహుబలి సిరీస్ కే పరిమితం కాలేదు. ఈ ఇద్దరూ త్వరలో మరో సినిమాలో కలసి నటించబోతున్నారు.

ఒకే కథను ఇద్దరు హీరోలతో రెండు భాషల్లో ఏక కాలంలో తెరకెక్కించే అలవాటున్న గౌతమ్ మీనన్.. ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. నలుగురు హీరోలు నటించబోతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించాల్సి ఉందట. ఇందులో ఇద్దరు కథానాయికలుగా అనుష్క, తమన్నాలను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు తర్వాత సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకు.. మరి వీరిద్దరూ ఓకే చెపుతారేమో చూడాలి..!